Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. స్థిరపడిన సెన్సెక్స్, నిఫ్టీ!
దేశీయ స్టాక్ మార్కెట్లలో (Stock Market) గురువారం తీవ్ర ఊగిసలాట కనిపించింది. ఉదయం నుంచి మార్కెట్ ముగిసే వరకు రోజంతా సూచీలు లాభనష్టాల మధ్య దోబూచులాడాయి. ఇన్వెస్టర్లు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో, చివరకు ప్రధాన సూచీలు ఏమాత్రం దిశానిర్దేశం లేకుండా ఫ్లాట్‌గా ముగిశాయి.
సూచీల ముగింపు ఇలా..
తీవ్ర ఒడిదుడుకుల మధ్య బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (Stock Market) సూచీ సెన్సెక్స్ కేవలం 27.46 పాయింట్ల నామమాత్రపు నష్టంతో 82,248.61 వద్ద ముగిసింది. మరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 14.05 పాయింట్ల స్వల్ప లాభంతో 25,496.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్-30 ప్యాక్‌లో కొన్ని షేర్లు లాభాల బాట పట్టగా, మరికొన్ని అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.లాభపడిన షేర్లలో బీఈఎల్ (BEL), అదానీ పోర్ట్స్, సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు ఉన్నాయి. నష్టపోయిన షేర్లలో ట్రెంట్, ఎటర్నల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు ప్రధానంగా ఉన్నాయి.

ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ 90.90 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 69.97 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, పసిడి ధర ఔన్సుకు 5182 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి







