చీరకట్టులో నిద్ర పట్టనీయకుండా చేస్తున్న రుక్మిణి
సప్త సాగరాలు దాటి(Sapta Sagaralu Daati) ఫ్రాంచైజ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకుపరిచయమైన రుక్మిణి వసంత్(Rukmini Vasanth), ఆ సినిమాలతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. తర్వాత తెలుగులో నిఖిల్(Nikhil) తో కలిసి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో(Appudo Ippudo Eppudo) సినిమా చేసింది కానీ అదెప్పుడు వచ్చి వెళ్లిందో కూడా తెలీదు. తిరిగి కాంతార చాప్టర్1(Kanthara Chapter1)లో నటించి పెద్ద బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న రుక్మిణి చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఓ వైపు కెరీర్లో బిజీగా ఉంటూనే అమ్మడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా రుక్మిణి ఓ అవార్డ్స్ ఫంక్షన్ కు వెళ్లగా, ఆ ఈవెంట్ లో ఆమె ట్రెడిషనల్ మరియు మోడ్రన్ ఎథ్నిక్ షాంపేన్ గోల్డ్ కలర్ నెట్ శారీలో మెరిసిపోయింది. శారీకి మ్యాచింగ్ బ్లౌజ్, సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని హెయిన్ ఎంతో అందంగా మెరవగా, ఆమె లుక్ కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తోంది.







