26th May 2026

___________

- Saidulu

షాంపూ ముందు ఈ చిన్న టిప్స్ తో హెయిర్ ప్రాబ్లమ్స్ కి చెక్..

వాతావరణ మార్పులు, కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలామంది జుట్టు రాలడం, చుండ్రు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

ఈ సమస్యలు తగ్గించడం కోసం కెమికల్స్ తో నిండిన ప్రొడక్ట్స్ వాడడం వల్ల హెయిర్ లాస్ మరింత పెరుగుతోంది.

తలస్నానం చేసే ముందు తలకు కొద్దిగా నూనె రాసి మసాజ్ చేయడం చాలా మంచిది. ఇది తల చర్మానికి తేమను అందిస్తుంది.

కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో తలకు మృదువుగా మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో జుట్టు బలంగా మారుతుంది.

చుండ్రు సమస్య ఎక్కువగా ఉన్నవారు నిమ్మరసం కొన్ని చుక్కలు నూనెలో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. తల చర్మం శుభ్రంగా ఉంటుంది.

తలస్నానం ముందు జుట్టును బాగా దువ్వడం కూడా అవసరం. ఇలా చేయడం వల్ల చిక్కులు తగ్గి జుట్టు విరగకుండా ఉంటుంది.

వేడి నీటితో తలస్నానం చేయకుండా గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది. ఇది జుట్టు సహజ తేమను కాపాడుతుంది.

షాంపూను ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరానికి తగ్గట్టే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

తలస్నానం చేసిన వెంటనే గట్టిగా తుడవకుండా మృదువైన టవల్‌తో ఆరబెట్టాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

ఆహారంలో ప్రోటీన్లు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. సరైన నిద్ర కూడా జుట్టుకు చాలా అవసరం.