అజింక్య రహానే ఎమోషనల్ కామెంట్స్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ప్రస్థానం నిరాశాజనకంగా ముగిసింది. లీగ్ దశ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) చేతిలో ఘోర పరాజయం పాలవడంతో కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఈ సీజన్ వైఫల్యంపై కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసాడ్డు. ఈ సీజన్ తమకు అనుకూలంగా సాగలేదని, ప్లేఆఫ్స్ చేరలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు.
టోర్నమెంట్ ఆరంభంలో వరుస ఓటములతో తీవ్ర ఇబ్బందుల్లో పడినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో జట్టు పుంజుకున్న తీరుపై రహానే ప్రశంసలు కురిపించాడు. మొదటి 6 మ్యాచ్‌ల తర్వాత జట్టు ఉన్న పరిస్థితి నుంచి ఆటగాళ్లు చూపిన పట్టుదల, ఒత్తిడిలోనూ కనబర్చిన ఐక్యత అద్భుతమని కొనియాడారు. లీగ్ రేసులో చివరివరకు నిలవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు శాయశక్తులా కృషి చేశారని, డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల వైఖరి పట్ల తాను ఎంతో గర్వపడుతున్నానని రహానే వ్యాఖ్యానించాడు.
ఈ ఐపీఎల్ సీజన్ ద్వారా జట్టుకు ఎన్నో సానుకూల అంశాలు లభించాయని కేకేఆర్ కెప్టెన్ స్పష్టం చేశాడు. ఈ సుదీర్ఘ టోర్నమెంట్లో ఎన్నో కీలక సమయాల్లో తృటిలో విజయాలను చేజార్చుకున్నామని, అయితే ఆటగాళ్ల కట్టుబాటు మరియు కష్టపడే తత్వంలో ఎలాంటి లోపం లేదని అన్నాడు. కాగా, ఆదివారం రాత్రి కోల్‌కతాలో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో కేకేఆర్‌ను ఓడించింది. ఈ పరాజయంతో మూడు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి







