గుజరాత్ టైటాన్స్‌కు ఆర్సీబీ కెప్టెన్ వార్నింగ్..!
ఐపీఎల్ 2026(Ipl) క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్(Rajat Patidar) ప్రత్యర్థి గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు పరోక్షంగా గట్టి హెచ్చరికలు పంపాడు. నేడు జరగబోయే ఈ భారీ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి, ప్రణాళికలను పక్కాగా అమలు చేసే జట్టే విజయం సాధిస్తుందని అతను ధీమా వ్యక్తం చేశాడు. క్వాలిఫైయర్ 1 లాంటి పెద్ద వేదికపై నరాలు తెగే ఉత్కంఠను తట్టుకుంటూ, ప్రతి ఒక్కరూ తమపై నమ్మకంతో ఆడటం చాలా ముఖ్యమని పాటిదార్ స్పష్టం చేశాడు.
ఈ సీజన్లో తమ జట్టుకు అతిపెద్ద బలం బౌలింగ్ విభాగమేనని ఆర్సీబీ కెప్టెన్ పేర్కొన్నాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో తాము బౌలింగ్ చేసే విధానం మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తుందని అన్నాడు. “మేము ఇక్కడికి స్కోరును కాపాడుకోవడానికి (Defend) రాలేదు, మొదటి బంతి నుంచే ప్రత్యర్థిపై దాడి చేసే (Attack) మైండ్‌సెట్‌తో బరిలోకి దిగుతున్నాం. పవర్‌ప్లేలోనే వికెట్లు తీయడమే మా లక్ష్యం. భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్, రసిఖ్ సలామ్ ఇప్పటివరకు ఇదే బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించాడు.
నేడు కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేస్తారని ఆశిస్తున్నాం అని రజత్ పాటిదార్ వెల్లడించాడు. జట్టులోని సహచర ఆటగాడు వెంకటేష్ అయ్యర్ ప్రదర్శనను పాటిదార్ ప్రత్యేకంగా కొనియాడాడు. ఆర్డర్‌తో సంబంధం లేకుండా జట్టు అవసరాలకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేసే ఆయన సానుకూల వైఖరి అద్భుతమని ప్రశంసించాడు. ఇక తన కెప్టెన్సీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. జట్టులో విరాట్ కోహ్లీ(Virat Kohli), దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ లాంటి ఎంతో అనుభవజ్ఞులైన సీనియర్ ఆటగాళ్లు ఉండటం వల్ల తనకు నాయకుడిగా పని చాలా సులువైందని, వారి అనుభవాలు, ఆలోచనలు జట్టును ముందుకు నడపడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని రహస్యాన్ని పంచుకున్నాడు. పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న భువనేశ్వర్ కుమార్ అనుభవం యువ బౌలర్లకు ఎంతో మార్గదర్శకంగా నిలుస్తోందని తెలిపాడు.
ఇవి కూడా చదవండి







