Stock Markets: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఏఐ టూల్ దెబ్బకు ఐటీ షేర్ల విలవిల!
దేశీయ స్టాక్ మార్కెట్లలో (Stock Markets) ‘కృత్రిమ మేధ’ (AI) ప్రకంపనలు సృష్టించింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పాటు మార్కెట్లోకి వచ్చిన ఒక కొత్త ఏఐ టూల్ ఐటీ రంగాన్ని బెంబేలెత్తించింది. ఐటీ, ఆటో రంగాల షేర్లలో వెల్లువెత్తిన భారీ అమ్మకాలతో మంగళవారం దేశీయ సూచీలు కుప్పకూలాయి. ఒక్కరోజే మదుపర్ల సంపద సుమారు రూ. 3 లక్షల కోట్లు ఆవిరైపోయింది.
సూచీల పతనం ఇలా..
ఉదయం 83,052 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ (Stock Markets).. రోజంతా అమ్మకాల ఒత్తిడిలోనే కొనసాగింది. ఇంట్రాడేలో ఒక దశలో 81,934 వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ, చివరకు 1,068.74 పాయింట్ల భారీ నష్టంతో 82,225.92 వద్ద స్థిరపడింది. జాతీయ సూచీ నిఫ్టీ కూడా 288.35 పాయింట్లు పతనమై 25,424.65 వద్ద ముగిసింది. ఈ పతనంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 466 లక్షల కోట్లకు పడిపోయింది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 90.95 వద్ద కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71.38 డాలర్లు, బంగారం ఔన్సు ధర 5173 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్-30లో (Stock Markets) టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, టైటాన్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.

ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలు..
ప్రముఖ ఏఐ స్టార్టప్ ‘ఆంథ్రోపిక్‘ (Anthropic) సరికొత్త ‘క్లాడ్ కోడ్’ (Claude Code) అనే టూల్‌ను పరిచయం చేసింది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు వాడే ఐబీఎం (IBM) మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్లలోని పాతతరం ‘COBOL’ కోడ్‌ను ఇది చాలా వేగంగా, తక్కువ ఖర్చుతో ఆధునీకరిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ సిస్టమ్స్ అప్డేట్ ద్వారా భారీ ఆదాయం గడించే ఐబీఎం వ్యాపారంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళనలతో, ఆ కంపెనీ షేర్లు (Stock Markets) ఒక్కరోజే 13 శాతానికి పైగా పతనమయ్యాయి. 26 ఏళ్లలో ఐబీఎంకిదే అతిపెద్ద నష్టం. ఈ భయాలు భారతీయ ఐటీ దిగ్గజాల (Infosys, TCS) షేర్లపై కూడా తీవ్ర ఒత్తిడిని పెంచాయి.
ఇటీవల సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అలుసుగా తీసుకుని ఏ దేశమైనా ఆటలాడాలని చూస్తే, వారిపై భారీ టారిఫ్‌లు (సుంకాలు) విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు గ్లోబల్ మార్కెట్లను (Stock Markets) భయపెట్టాయి. వీటికి తోడు అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి.
ఇవి కూడా చదవండి







