Anthropic: ఏఐతో ముందుగా పోయే ఉద్యోగాలు ఇవే: ఆంథ్రోపిక్ సీఈఓ
కృత్రిమ మేధ (AI) సాంకేతికత అన్ని రంగాల్లోకి శరవేగంగా చొచ్చుకుపోతోంది. దీని ప్రభావంతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతను (లేఆఫ్‌లు) చూస్తున్నాం. అయితే ఏఐ రాకతో భవిష్యత్తులో ముందుగా ఏయే ఉద్యోగాలు కనుమరుగవుతాయి అన్న దానిపై ప్రముఖ ఏఐ డెవలప్మెంట్ సంస్థ ‘ఆంథ్రోపిక్’ (Anthropic) సీఈఓ డారియో అమోడెయ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో ఆయన పాల్గొని పలు కీలక అంశాలను పంచుకున్నారు.
కోడింగ్ ఉద్యోగాలకే తొలి ముప్పు..
ఏఐ ఆటోమేషన్ దెబ్బకు ముందుగా బలయ్యేది కోడింగ్ ఉద్యోగాలేనని డారియో (Anthropic) తేల్చిచెప్పారు. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ రాయడంలో ఏఐ వ్యవస్థలు అత్యంత వేగంగా పరిణతి చెందుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అయితే సాఫ్ట్వేర్ రంగంలోని ఆర్కిటెక్చర్, ప్రొడక్ట్ సెన్స్, యూజర్ అండర్స్టాండింగ్ వంటి కీలకమైన ఇంజనీరింగ్ విభాగాలను ఏఐ ఆటోమేట్ చేయడానికి మాత్రం కాస్త ఎక్కువ సమయం పడుతుందన్నారు. కానీ భవిష్యత్తులో ప్రస్తుతం మనుషులు చేసే ఆ పనులన్నింటినీ ఏఐ కచ్చితంగా తన ఆధీనంలోకి తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఆ దశలో మనుషులు కేవలం ఈ ఏఐ టూల్స్‌కు మార్గనిర్దేశం (Direction) చేసే ఉన్నతస్థాయి విధులకు మాత్రమే పరిమితమవుతారని ఆయన విశ్లేషించారు.
![]()
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అతిగా ఆధారపడితే ప్రమాదమే..
ఏఐ అద్భుతమైన (Anthropic) అవుట్‌పుట్ ఇస్తున్నప్పటికీ, దానిపై విపరీతంగా ఆధారపడటం మనుషులకే ప్రమాదకరమని డారియో హెచ్చరించారు. ముఖ్యంగా విద్యారంగంలో దీని ప్రభావం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ సొంత ఆలోచనా శక్తిని పక్కనపెట్టి, థింకింగ్ ప్రాసెస్‌ను పూర్తిగా ఏఐకి అప్పగించడం వల్ల వారి తార్కిక, విశ్లేషణాత్మక (Reasoning) సామర్థ్యాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. ఏఐని ఈ విధంగా దుర్వినియోగం చేయడం మూర్ఖత్వమే అవుతుందన్నారు.
ఈ ఆర్టిఫిషియల్ (Anthropic) ఇంటెలిజెన్స్ యుగంలో యువత భవిష్యత్తులో రాణించాలంటే ‘క్రిటికల్ థింకింగ్ స్కిల్స్’ (క్లిష్టమైన విషయాలను విశ్లేషించి నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు) పెంచుకోవడం అత్యంత కీలకమని ఆయన సలహా ఇచ్చారు. కాగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆంథ్రోపిక్ (Anthropic) సంస్థను స్థాపించడానికి ముందు తాను ఒక బయోలజిస్ట్గా (జీవశాస్త్రవేత్త) పనిచేశానని డారియో ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి







