Anirudh Ravichander: ఏఐ గురించి అనిరుధ్ ఏమంటున్నాడంటే?
సినీ పరిశ్రమలో ఏఐ వినియోగం రోజురోజుకూ విస్తరిస్తూ సాంకేతికంగా, సృజనాత్మకంగా కొత్త అవకాశాలను తెరపైకి తీసుకొస్తోంది. ముఖ్యంగా సంగీత రంగంలో AI ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్(Anirudh ravichander), AI సామర్థ్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. AI ఒక అద్భుతమైన సాధనమని పేర్కొన్న ఆయన, దాని అసలైన విలువ మనం దాన్ని ఎలా ఉపయోగిస్తామనే విషయంలోనే ఉందని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, దానికి సృజనాత్మక దిశను చూపేది మనుషులేనని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజాగా వేట్టయాన్(Vettayan) మూవీలో భాగంగా AI వినియోగంపై ఆయన మాట్లాడారు. ఈ సినిమాకు మ్యూజిక్ అందించే టైమ్లో, లెజెండరీ సింగర్ మలేషియా వాసుదేవన్(malaysia vasudevan) గొంతుని టెక్నికల్ గా రీక్రియేట్ చేసేందుకు AI సాయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రయోగం విశేష స్పందన పొందింది. టెక్నాలజీ ద్వారా ఐకానిక్ స్వరాలను గౌరవప్రదంగా మళ్లీ వినిపించే అవకాశాన్ని ఇది చూపించిందని అనిరుధ్ తెలిపారు. గతేడాది తో పోలిస్తే AI మరింత అభివృద్ధి చెందిందని, ఇప్పుడు ఒకే లైన్ను పాడి, దానిని వివిధ మహిళా స్వరాలుగా మార్చడం, పిచ్ మరియు టోన్ను మార్చడం సాధ్యమవుతోందని చెప్పారు.
ఏఐ ఇప్పుడు ప్రారంభ దశలో ఉందని, ఇది కేవలం ఎర్లీ బర్డ్ మాత్రమే అంటూ అనిరుధ్ వ్యాఖ్యానించారు. ఫ్యూచర్ లో సంగీత రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదొక రూపంలో AIను వినియోగిస్తారని ఆయన విశ్వసిస్తున్నారు. సినిమా సంగీతం, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాంటి విభాగాల్లో AI కీలక పాత్ర పోషించే రోజులు దూరంలో లేవని ఆయన అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ కాలంలో, AI సినిమా మరియు సంగీత రంగాలను కొత్త దిశగా తీసుకెళ్తుందనే సంకేతాలను అనిరుధ్ వ్యాఖ్యలు స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి







