జూన్ 6న జీటీఏ ఇంటర్నేషనల్ ఫెస్ట్
GTA: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో జూన్ 6, 2026న “జీటీఏ ఇంటర్నేషనల్ ఫెస్ట్” ఘనంగా నిర్వహించనున్నారు. ‘వన్ కమ్యూనిటీ, మెనీ కల్చర్స్, ఎండ్లెస్ కనెక్షన్స్’ అనే నినాదంతో జరిగే ఈ అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో సేవలందించడానికి యువ వాలంటీర్లను ఆహ్వానిస్తున్నారు.
విభాగాలు..
ఈ ఈవెంట్లో స్టేజ్ క్రూ, కిడ్స్ జోన్, కల్చరల్ ప్రోగ్రామ్, ఫోటోగ్రఫీ & వీడియో, ఇంటర్నేషనల్ విలేజ్ హోస్ట్స్, మ్యూజిక్ & డాన్స్ హెల్పర్స్, ఫుడ్ సర్వీస్ , పార్కింగ్ విభాగాలలో వాలంటీర్లుగా పనిచేసేందుకు ఆసక్తి గలవారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
వివరాలు..
తేదీ: జూన్ 6, 2026 (శనివారం)
సమయం: మధ్యాహ్నం 3:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు (EST)
వేదిక: కమ్మింగ్, జార్జియా (Cumming, GA), యునైటెడ్ స్టేట్స్.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో భాగస్వామ్యమై కమ్యూనిటీకి సేవ చేయాలనుకునే వారు ఫ్లయర్పై ఉన్న క్యూఆర్ (QR) కోడ్ లేదా అధికారిక లింక్ ద్వారా వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరారు.







