పోలీసు కస్టడీకి బండి భగీరథ్
పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ (Bandi Bhagirath) ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ జిల్లా కోర్టు (Medchal District Court) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీసీపీ రితిరాజ్ (DCP Rithiraj) పర్యవేక్షణలో భగీరథ్ ను బుధవారం విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిచాడన్న ఆరోపణలతో బండి బగీరథ్ పై ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసు విచారణాధికారి కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆదేశాలతో 5 బృందాలుగా రంగంలోకి దిగిన పోలీసులు, ఈనెల 16న భగీరథ్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, నిందితుడిని పూర్తిస్థాయిలో విచారించి మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పేట్ బషీరాబాద్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ ఆరోపణలు నిజం కాదని, కుట్రపూరితంగా ఇరికించారని, ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై వాదనలు విన్న మేడ్చల్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి తిరుపతి (Tirupati), పోలీసుల వాదనతో ఏకీభవించారు. బండి భగీరథ్ ను మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైల్లో (Charlapally Jail) రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌ను పేట్‌బషీరాబాద్ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకోనున్నట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి







