మంగళగిరిలో పసుపు సందడి.. ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు
తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు (Mahanadu) హైబ్రిడ్ విధానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు (Chandrababu) తెలుగుదేశం జెండా ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి (NTR statue) నివాళులర్పించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ (Nara Lokesh), పొటిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. 1875 క్లస్టర్ల నుండి వేలాదిమంది కార్యకర్తలు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానం ద్వారా వీక్షించనున్నారు. ముఖ్య నాయకుల స్పీచ్లను హైబ్రిడ్ విధానంలో 175 నియెజకవర్గాల నేతలు, కార్యకర్తలు ఈసారి ఆన్ లైన్లో విననున్నారు. దానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం అన్ని ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి







