పోలీసులు నాకు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదు : ప్రొఫెసర్ నాగేశ్వర్
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (C.V. Anand) ను ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ (Professor Nageshwar)కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో తనపై చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను ఇప్పటికే ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులూ (Notices) ఇవ్వలేదని నాగేశ్వర్ స్పష్టం చేశారు.
ఇటీవల ఓ టీవీ ఛానెల్ లో జనసేన అధితనే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయనపైఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో నాగేశ్వర్ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణకు చేరుకున్నారంటూ ప్రచారం జరిగింది. దాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఇదంతా అసత్య ప్రచారమని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి







