రైతులకు తానా సేవ ప్రశంసనీయం… గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు నరేన్ కొడాలి, తానా ఈవీపీ శ్రీనివాస్ లావు నాయకత్వంలో గుడివాడ రైతులకు తానా ట్రెజరర్ కసుకుర్తి రాజా సౌజన్యంతో, ఎమ్మెల్యే రాము సహకారంతో రూ.25 లక్షల రూపాయల విలువైన సహాయాన్ని అందించారు. పి-4 కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 700 టార్పలిన్లు,100 చార్జింగ్ స్ప్రేయర్లు పంపిణీ చేశారు. రైతు కోసం కార్యక్రమంలో భాగంగా, ట్రెజరర్ కసుకుర్తి రాజా సౌజన్యంతో, ఎమ్మెల్యే రాము సహకారంతో గుడివాడ నియోజకవర్గ రైతులకు స్ప్రేయర్లు, టార్పలిన్లు పంపిణీ కార్యక్రమం గుడివాడ మార్కెట్ యార్డ్ లో ఘనంగా జరిగింది. రూ.25 లక్షల వ్యయంతో సమకూర్చిన 700 టార్పలిన్లు, 100 చార్జింగ్ స్ప్రేయర్లను వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రైతులకు అందజేశారు. ముందుగా రైతులకు అందించే స్ప్రేయర్లు, టార్పలిన్లను రైతులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ దేశం మీద ప్రేమతో గొప్ప కార్యక్రమాలు చేసే సంస్థ తానా అని కొనియాడారు. రైతు కుటుంబంలో పుట్టి వేలాది మంది రైతులకు సహాయం అందిస్తున్న తానా ట్రజరర్ రాజాకసుకుర్తి గొప్ప వ్యక్తి అన్నారు. రైతన్నలకు మేలు చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని, రైతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. వరదల సమయంలో రైతులకు అండగా నిలిచామని, కాలువల అభివృద్ధి, డ్రైనేజీలలో సిల్ట్ తొలగింపు పనులు పెద్ద ఎత్తున చేసి రైతాంగ సుదీర్ఘ సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి, మనందరం అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

తానా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ రైతు కోసం తానా కాన్సెప్ట్, పి.4లో భాగంగా రైతులకు సహాయం చేయాలనే లక్ష్యంతో తానా తరపున రాజా, ఎమ్మెల్యే రాము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 3 నియోజకవర్గాల్లో రూ.1.03 కోట్లతో సహాయ కార్యక్రమాలు చేశామని, ఎమ్మెల్యే రాము కృషి ఫలితంగా నేడు గుడివాడలో కార్యక్రమం చేసినట్లు చెప్పారు. ప్రతి రైతుకూ టార్పలిన్లు అవసరమని, ఖరీదైన స్ప్రేయర్లను కూడా ఉచితంగా ఇవ్వడం పట్ల రైతులు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చేవి ఉచితంగా అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే రాముకు, దాతృత్వంతో అందిస్తున్న తానా రాజాకు కృతజ్ఞతలు చెప్పారు.
ఈ కార్యక్రమంలో గుడివాడ, గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్లు చాట్రగడ్డ రవికుమార్, పొట్లూరి రవి, జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టౌన్, రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల టిడిపి అధ్యక్షులు పండ్రాజు సాంబశివరావు, వాసే మురళి, దానేటి సన్యాసిరావు, పోలవరపు వెంకట్రావు, జనసేన పార్టీ గుడ్లవల్లేరు మండల అధ్యక్షులు తోట చిన్నారి, కళింగ కార్పొరేషన్ చైర్మన్ మజ్జాడ నాగరాజు, సీనియర్ టిడిపి నాయకులు లింగం ప్రసాద్, డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, చేకూరు జగన్మోహన్రావు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పేర్ని జగన్, గుడివాడ నియోజకవర్గ టిడిపి నాయకులు వెనిగళ్ళ నాగేశ్వరరావు, వల్లభనేని రంగబాబు, వలురుపల్లి వెంకటేశ్వరరావు, పులవర్తి డేవిడ్, అంజిరెడ్డి, పెద్ది వీరభద్రరావు, మల్లిపెద్ది సుబ్రమణ్యం, తోట వెంకటేశ్వరరావు, బుర్ర నాగేశ్వరరావు, గొర్ల శ్రీలక్ష్మి, మాదాల సునీత, అమర్ బాబు, దేవేంద్రుడు, బొప్పన శివప్రసాద్, రాజు, వంశీకృష్ణ, తోకల క్రాంతి, పిల్ల సాల్మన్, తోట సాయి గంగరాజు, రెడ్డిఅప్పరావు, దరపురెడ్డి శేషు, పామర్తి సత్తిబాబు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.







