26th May 2026

___________

- Saidulu

శరీరంలో ఐరన్ తగ్గిందని చూపించే మార్పులు 

శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఐరన్ స్థాయులు తగ్గిపోతే రక్తహీనతతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కనిపించే అవకాశం ఉంది.

ఎప్పుడూ అలసటగా ఉండటం ఐరన్ లోపానికి ప్రధాన లక్షణంగా భావిస్తారు. తగిన విశ్రాంతి తీసుకున్నా నీరసం తగ్గకపోవచ్చు.

చిన్న పనులు చేసినా ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం కూడా ఐరన్ తక్కువగా ఉన్న సంకేతంగా చెబుతున్నారు.

చర్మం వెలితిగా, పాలిపోయినట్టుగా కనిపించడం ఈ సమస్యలో సాధారణంగా కనిపించే లక్షణం. ముఖంలో సహజ కాంతి తగ్గిపోతుంది.

తలనొప్పి, తల తిరగడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొందరిలో చిరాకు పెరగవచ్చు.

జుట్టు రాలడం ఎక్కువ కావడం, గోర్లు బలహీనంగా మారడం కూడా ఐరన్ లోపంతో సంబంధం ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

చేతులు, కాళ్లు చల్లగా ఉండటం, శరీరంలో బలహీనత ఎక్కువగా అనిపించడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

గుండె వేగంగా కొట్టుకోవడం లేదా ఛాతిలో అసౌకర్యంగా అనిపించడం వంటి సమస్యలు తీవ్రమైన ఐరన్ లోపానికి సంకేతాలుగా భావిస్తారు.

పాలకూర, బీట్‌రూట్, ఖర్జూరం, దానిమ్మ, ఆకుకూరలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది.

లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.