27th May 2026

___________

- Saidulu

విరిగిన ఎముకలకు మునుపటిలా బలపడేందుకు ఉత్తమ ఆహారాలు

ఎముకలు విరిగినప్పుడు సరైన చికిత్సతో పాటు పోషకాహారం కూడా చాలా ముఖ్యం. శరీరానికి అవసరమైన పోషకాలు అందితే ఎముకలు త్వరగా అతుక్కోవడానికి సహాయపడుతుంది.

పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ పాలు, పెరుగు తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.

గుడ్లలో ప్రోటీన్, విటమిన్ D సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

బాదం, వాల్‌నట్స్ వంటి డ్రైఫ్రూట్స్ శరీరానికి మంచి కొవ్వులు, ఖనిజాలు అందిస్తాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

ఆకుకూరల్లో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలు తీసుకోవడం మంచిది.

చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ D ఉంటాయి. ఇవి ఎముకలు బలపడటానికి సహాయపడతాయి.

నువ్వులు, రాగి వంటి ఆహారాల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

పండ్లలో ముఖ్యంగా నారింజ, మోసంబి వంటి వాటిలో విటమిన్ C ఉంటుంది. ఇది శరీరంలో కాలజెన్ తయారికి ఉపయోగపడుతుంది.

పప్పులు, శనగలు వంటి ప్రోటీన్ ఆహారాలు కండరాలు, ఎముకలకు బలం ఇస్తాయి. కోలుకునే ప్రక్రియను వేగంగా చేస్తాయి.

తగినంత నీరు తాగడం, జంక్ ఫుడ్ తగ్గించడం కూడా చాలా ముఖ్యం. సరైన ఆహారపు అలవాట్లు ఎముకలు త్వరగా కోలుకునేందుకు సహాయపడతాయి.