సీయాటిల్లో ఘనంగా జరిగిన ‘మీట్ అండ్ గ్రీట్’
ATA: అమెరికా తెలంగాణ సంఘం సీయాటిల్ (ATA-Seattle) చాప్టర్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్కిటెక్ట్, సినీ కళా దర్శకుడు ఆనంద్ సాయితో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. వాషింగ్టన్లోని రెడ్మండ్ నగరంలో గల ‘ఎలిమెంట్స్ బై సీయాటిల్ మారియట్’ వేదికగా ఇటీవల నిర్వహించారు.
యాదాద్రి పుణ్యక్షేత్ర అద్భుత కట్టడాల రూపశిల్పిగా, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు మెంబర్గా, అలాగే 100కు పైగా తెలుగు చిత్రాలకు కళా దర్శకుడిగా విశేష సేవలందించిన ఆనంద్ సాయిని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీయాటిల్లోని తెలుగు కమ్యూనిటీ అంతా ఒకచోటికి చేరి ఆనంద్ సాయితో ముఖాముఖిగా మాట్లాడేందుకు, ఆయన అనుభవాలను పంచుకునేందుకు ఒక మంచి వేదిక లభించిందని నిర్వాహకులు తెలిపారు.

కార్యవర్గ సభ్యులు..
- శ్రీనివాస్ రెడ్డి బండారపు (అధ్యక్షుడు)
- పరుష మర్రి (ఉపాధ్యక్షురాలు)
- హేమంత్ గండవరపు (ప్రధాన కార్యదర్శి)
- చందు అల్లిపురం (సాంస్కృతిక కార్యదర్శి)
- కృష్ణ కాంత్ పసుమర్తి (కోశాధికారి)
- సోమేష్ కుమార్ మలిశెట్టి (కమ్యూనికేషన్ & పీఆర్ డైరెక్టర్)
- సంతోష్ దూదం (జాయింట్ సెక్రటరీ)
శ్రీనివాస్ గజవాడ (వెబ్ మాస్టర్) , ఇతరులు కీలక పాత్ర పోషించారు. ఈ ఈవెంట్కు వివిధ దేశీ టీవీలు మీడియా భాగస్వాములుగా వ్యవహరించాయి.
ఇవి కూడా చదవండి







