పాదయాత్రలో ట్రైలర్ చూపిస్తే … తర్వాత ఎన్నికల్లో ప్రజలు సినిమా : ఎంపీ బైరెడ్డి శబరి
అణచి వేసే ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీలో యోధులు పుట్టుకొస్తారని గొడ్డలిపార్టీకి అర్థమై ఉంటుందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (Byreddy Shabari) వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీకి లోకేశ్ (Lokesh) తన పాదయాత్రలో ట్రైలర్ (Trailer) చూపిస్తే, ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు సినిమా (Movie) చూపించారన్నారు. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నివేదికను బైరెడ్డి శబరి సమర్పించారు. రాజకీయ ప్రత్యర్థి జిత్తుల మారి నక్క, కార్యకర్తల డేగ కన్నుతో నిఘా పెట్టాలి. నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ టీడీపీ ముందంజలో ఉందని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పించే దిశగా నారా లోకేశ్ కృషి చేస్తున్నారన్నారు. అండమాన్లోనూ టీడీపీ జెండా రెపరెపలాడుతోందని ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి







