సెకండ్ ట్రైలర్ ను ఆశిస్తున్న పెద్ది ఫ్యాన్స్
పెద్ది(Peddi) సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతటి అంచనాలు ఉన్నాయో తాజాగా ట్రైలర్ చుట్టూ జరుగుతున్న చర్చలే చెబుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకోగా, ముఖ్యంగా రామ్ చరణ్(Ram Charan) మాస్ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. అయితే ఇటీవల వచ్చిన ట్రైలర్ మాత్రం ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రశంసలు వచ్చినప్పటికీ, కథలోని భావోద్వేగ బలం స్పష్టంగా కనిపించలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న డిమాండ్ సెకండ్ ట్రైలర్ గురించే. మొదటి ట్రైలర్లో స్టోరీపై క్లారిటీ తగ్గిందని, చరణ్ మేకోవర్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ముఖ్యంగా ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత చరణ్ నుంచి మరింత బలమైన కంటెంట్ ఆశిస్తున్న అభిమానులు మరో పవర్ఫుల్ కట్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఇటీవల కొన్ని పెద్ద సినిమాలు కూడా రిలీజ్‌కు ముందు రెండో ట్రైలర్ లేదా ఫైనల్ యాక్షన్ కట్‌తో బజ్ పెంచుకున్న ఉదాహరణలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ టైమ్ లో కొత్త ట్రైలర్ వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఇక మరోవైపు సినీ విశ్లేషకులు మాత్రం ట్రైలర్ ఆధారంగా సినిమాపై తుది నిర్ణయానికి రావడం సరైంది కాదని చెబుతున్నారు. గతంలో ట్రైలర్లకు మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చినా థియేటర్లలో బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchibabu Sana) అసలు ఎమోషనల్ కోర్‌ను కావాలనే దాచిపెట్టారేమో అన్న చర్చ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ట్రైలర్‌పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.







