చిన్న వయస్సులోనే ఈ రెండు స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ సెటిల్డ్!
SIP Investment: ప్రస్తుత రోజుల్లో మధ్యతరగతి కుటుంబాలలో పొదుపు, పెట్టుబడులపై అవగాహన బాగా పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న వయస్సు నుంచే పొదుపు చేయడం ప్రారంభించడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ మొత్తంతో పెద్ద సంపదను సృష్టించుకోవడానికి ప్రస్తుతం ‘సిప్’ (SIP), ‘పీపీఎఫ్’ (PPF) పెట్టుబడులకు మార్కెట్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అయితే ఈ రెండింటిలో దేని ప్రయోజనాలు, రాబడులు ఎలా ఉంటాయో ఆర్థిక నిపుణుల లెక్కల ప్రకారం ఇప్పుడు చూద్దాం.
సిప్ (SIP – మ్యూచువల్ ఫండ్స్)..
ఇది పూర్తిగా స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది. రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఇందులో భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ప్రతి నెలా రూ.2,000 చొప్పున 30 ఏళ్ల పాటు సిప్‌లో పెట్టుబడి పెడితే, సగటున 12 శాతం వార్షిక రాబడి (Returns) అంచనాతో దాదాపు రూ.70 లక్షల వరకు సంపదను కూడబెట్టుకోవచ్చు. ఇందులో మీ అసలు పెట్టుబడి కేవలం రూ.7.2 లక్షలు మాత్రమే కాగా, మిగిలిన రూ.62.8 లక్షలు మార్కెట్ లాభాల ద్వారా వస్తుంది.
పీపీఎఫ్ (PPF – పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్)..
ఇది కేంద్ర ప్రభుత్వం అందించే సురక్షితమైన చిన్న పొదుపు పథకం. ఇందులో రిస్క్ అస్సలు ఉండదు , పన్ను మినహాయింపు (Tax Benefit) కూడా లభిస్తుంది. ప్రతి నెలా అదే రూ.2,000 మొత్తాన్ని 30 సంవత్సరాల పాటు పీపీఎఫ్‌లో పొదుపు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వ వడ్డీ రేట్ల ప్రకారం కాలపరిమితి ముగిసేసరికి సుమారు రూ.25 లక్షల నుండి రూ.30 లక్షల వరకు చేతికి అందుతుంది.
నిపుణుల సలహా..
దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలు, పెద్ద మొత్తంలో సంపద కావాలనుకునే వారు ‘సిప్’ (SIP) మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రభుత్వ భద్రతతో కూడిన స్థిరమైన రాబడిని కోరుకునే వారు ‘పీపీఎఫ్’ (PPF) లో పెట్టుబడి పెట్టడం మంచిది. మార్కెట్ రిస్క్‌ను బ్యాలెన్స్ చేయడానికి చాలా మంది ఈ రెండింటిలోనూ కొంత మొత్తాన్ని సర్దుబాటు చేస్తూ పెట్టుబడులు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి







