డాన్ 3 వివాదం.. రణ్‌వీర్‌పై బ్యాన్.. కానీ హీరో రియాక్షన్ ఇదే!
బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన డాన్3(Don3) వివాదం మరో మలుపు తిరిగింది. హీరోగా ఎంపికైన రణ్వీర్ సింగ్(Ranveer Singh) పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) నిషేధం విధించడంతో ఇండస్ట్రీలో చర్చలు మరింత వేడెక్కాయి. ఇదే సమయంలో ధురంధర్ (Dhurandhar) సినిమాతో సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న రణ్వీర్ సింగ్ తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడం ప్రత్యేకంగా మారింది. నిషేధం ప్రకటించిన తర్వాత ఆయన చేసిన తొలి పబ్లిక్ అపియరెన్స్ ఇదే కావడం గమనార్హం. అయితే మీడియా ప్రశ్నలపై ఆయన ఎలాంటి స్పందన ఇవ్వకుండా నిశ్శబ్దంగా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.
ఈ వివాదంపై రణ్వీర్ సింగ్ అధికార ప్రతినిధి విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. సినీ పరిశ్రమపైనా, డాన్ ఫ్రాంచైజ్‌తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరిపైనా రణ్‌వీర్‌కు అత్యంత గౌరవం ఉంది. ఇటీవల జరిగిన పరిణామాలపై ఆయన మౌనం పాటించడం వెనుక కారణం, వృత్తిపరమైన అంశాలు పరస్పర గౌరవంతో, పరిపక్వతతో పరిష్కరించాలనే అభిప్రాయమని పేర్కొన్నారు. వివాదాన్ని మరింత పెంచకుండా ఉండేందుకే రణ్వీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు FWICE మాత్రం తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. డాన్3 అంశంపై చర్చించేందుకు ఫెడరేషన్ సంప్రదించినప్పటికీ రణ్వీర్ స్పందించలేదని, అందుకే నిర్మాతల పక్షాన నిలబడి నిషేధం విధించినట్లు వెల్లడించింది. ఈ పరిణామాలు బాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీస్తుండగా, డాన్3 ఫ్యూచర్ పై కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రణ్వీర్ తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.







