స్పెషల్ సాంగ్లో శోభిత?
రీసెంట్ గానే యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తో శోభిత ధూళిపాళ్లకు నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లితో ఒకటి కానున్నారు. అయితే మొన్నటివరకు పెళ్లి తర్వాత శోభిత యాక్టింగ్ కెరీర్ ను కంటిన్యూ చేస్తుందా లేదా అని అందరూ అనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం పెళ్లి తర్వాత కూడా శోభిత నటిగా తన కెరీర్ ను కొనసాగిస్తుందని తెలుస్తోంది.
బాలీవుడ్, టాలీవుడ్ నుంచి శోభితకు ఆఫర్ల పరంగా ఎలాంటి లోటు లేదు. బాలీవుడ్ మీడియా వర్గాల ప్రకారం శోభితకు బాలీవుడ్ లో ఓ సూపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. రణ్వీర్ సింగ్ డాన్ 3లో శోభిత నటించే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డాన్3 లో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ శోభితను సంప్రదించారట.
ప్రస్తుతం శోభిత డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ తో డిస్కషన్స్ చేస్తుందని, ఇప్పటికే అతడితో పలుమార్లు మీటింగ్స్ జరిగాయని సమాచారం. తనదైన టాలెంట్ తో ఇప్పటికే అందరినీ ఇంప్రెస్ చేసిన శోభిత, డాన్3 లో ఈ స్పెషల్ సాంగ్ లో కనిపించాల్సిందేనని ఫర్హాన్ పట్టుబట్టి కూర్చున్నాడని తెలుస్తోంది. శోభిత తప్ప ఈ సాంగ్ కు మరెవరూ అవసరం లేదని కూడా ఆయన భావిస్తున్నాడట. ఇప్పటివరకు శోభిత ఈ సాంగ్ కోసం ఎలాంటి అగ్రిమెంట్స్ చేయలేదు కానీ బంగారం లాంటి ఈ అవకాశాన్ని శోభిత కాదనే ఛాన్స్ తక్కువే. వచ్చే ఏడాది మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో ఒకటిగా డాన్3 రానుంది.













