వెకేషన్ మోడ్ లో బన్నీ
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకా(raaka)పై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. డైరెక్టర్ అట్లీ(Atlee) తెరకెక్కిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం బన్నీ గత కొన్ని నెలలుగా వరుస షెడ్యూల్స్‌లో పాల్గొంటూ బిజీగా గడిపారు. అయితే రెగ్యులర్ షూటింగ్‌లతో అలసటకు గురికాకుండా ఉండేందుకు ఆయన ప్రస్తుతం చిన్న విరామం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన భార్య స్నేహా రెడ్డి(Sneha Reddy), పిల్లలతో కలిసి యూరప్ టూర్‌కు వెళ్లిన బన్నీ ప్రస్తుతం పారిస్‌లో హాలీడే ఎంజాయ్ చేస్తున్నారని సమాచారం. మే నెలాఖరులోగా ఆయన తిరిగి ఇండియాకు చేరుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక రాకా టీమ్ కూడా ప్రస్తుతం బ్రేక్ మోడ్‌లోనే ఉందని తెలుస్తోంది. జూన్ నుంచి ముంబైలో భారీ షెడ్యూల్ ప్రారంభించేందుకు డైరెక్టర్ అట్లీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఈ షెడ్యూల్లో కీలక యాక్షన్ సన్నివేశాలతో పాటు పలు హై వోల్టేజ్ ఎపిసోడ్స్ తెరకెక్కనున్నాయని టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచే సినిమా కాన్సెప్ట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అట్లీ విజువల్ ప్రెజెంటేషన్, బన్నీ కొత్త లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేశాయి.
ఈ సినిమాలో దీపికా పదుకొణె(Deepika Padukone), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), రష్మిక మందన్నా(Rashmika Mandanna), జాన్వీ కపూర్(Janhvi Kapoor) కీలక పాత్రల్లో నటిస్తుండటం ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. భారీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్(Sun Pictures) ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ మూవీ తర్వాత బన్నీ, లోకేష్ కనగరాజ్ తో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.







