మహేష్ నీల్ ఇప్పట్లో కుదిరే పని కాదు!
సోషల్ మీడియాలో ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)- డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్‌పై భారీ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఈ ఇద్దరూ త్వరలో కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చే పరిస్థితులు కనిపించడం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల్లో నిజం కంటే ఊహాగానాలే ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తన ఫుల్ ఫోకస్‌ను డ్రాగన్(Dragon) ప్రాజెక్ట్‌పైనే పెట్టినట్లు సమాచారం. ఆ సినిమా పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం ఉండటంతో పాటు, తర్వాత సలార్2(Salaar2), KGF చాప్టర్3(KGF3) వంటి భారీ కమిట్మెంట్లు కూడా ఆయన ముందున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబుతో వెంటనే సినిమా ప్రారంభించే అవకాశం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఒక దశలో ఈ కాంబినేషన్‌పై చర్చలు జరిగినా, నీల్ బిజీ షెడ్యూల్ కారణంగా అవి ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది.
ఇక మహేష్ బాబు మాత్రం ప్రస్తుతం తన కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రాజమౌళి(Rajamouli) తెరకెక్కిస్తున్న వారణాసి(varanasi) కోసం చాలా కాలం కేటాయించిన ఆయన, ఇకపై బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ప్రశాంత్ నీల్‌తో సినిమా ఎప్పుడైనా జరుగుతుందనే అంశంపై క్లారిటీ లేకపోయినా, ప్రస్తుతం మాత్రం అది సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచే గాసిప్‌గానే మిగిలిపోయిందని చెప్పాలి.







