గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “దీవాన”
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “దీవాన” గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుందని ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. “దీవాన” పోస్టర్ తో ఇది ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ లో ఉన్న మ్యాడ్ నెస్ చూపించబోతున్నారు అని అర్థమవుతోంది.
ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ ఇప్పటికే సాంగ్, టీజర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. “దీవాన” సినిమా టీజర్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, సింగర్ కార్తిక్ పాడిన ఇది ప్రేమా .. ఇది ప్రేమా..’ సాంగ్ ఛాట్ బస్టర్ గా మారింది. యూత్ ఆడియెన్స్ లో “దీవాన” సినిమా పట్ల మంచి క్రేజ్ ఏర్పడుతోంది.
ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై మరియు దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు.
ఇవి కూడా చదవండి







