రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న దీవానా
టాలీవుడ్లో యూత్‌ఫుల్ లవ్ స్టోరీస్‌కు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పుడదే జానర్లో మరో ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా దీవానా(Deewana) ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతోంది. యంగ్ హీరో హర్షిత్ రెడ్డి(harshith reddy) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి(Srikanth Sangisetty) ఎమోషన్స్ తోనిండిన లవ్ స్టోరీగా రూపొందిస్తున్నారు. అర్హ మీడియా(Arha Media), వి స్టూడియోస్(V Studios) బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని(Vasudev Koppineni), శ్రీదేవి కార్యంపూడి(Sridevi Karyampudi) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ తీసుకురాగా, తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో మూవీ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
దీవానా సినిమాను జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్స్(Geetha film distributors) విడుదల చేయడం సినిమాకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాంతార(Kantaara), మహావతార్ నరసింహ(Mahavtar narasimha) తెలుగు రిలీజ్‌లాంటి విజయవంతమైన సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ ప్రాజెక్ట్‌కు అండగా నిలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక రిలీజ్ డేట్ పోస్టర్ చూస్తే ఇది సాధారణ లవ్ స్టోరీ కాదని స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు ప్రేమలోని పిచ్చి, బాధ, ఎమోషన్స్‌ను ఇంటెన్స్‌గా చూపించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్‌ను బలంగా కనెక్ట్ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోస్టర్లో కనిపించిన మ్యాడ్నెస్, రొమాంటిక్ ఎమోషన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
ఇవి కూడా చదవండి







