ఆయనను పట్టుకుంటే మాడి మసైపోతారు : బుద్దా వెంకన్న
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులాంటి మనిషి, ఆయనను పట్టుకుంటే మాడి మసైపోతారు అని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న (Buddha Venkanna) అన్నారు. టీడీపీ మహానాడు ప్రారంభమవుతున్న సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వన్ టౌన్ లోని సీతమ్మవారి పాదాల వద్ద సుమారు రూ.18 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ (NTR), చంద్రబాబు, లోకేశ్ (Lokesh) ఫొటోలతో 150 అడుగుల భారీ కటౌట్ ను బుద్దా వెంకన్న ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ ప్రారంభం సందర్భంగా బుద్దా మాట్లాడుతూ ఎన్టీఆర్ జన్మస్థలం, ఏపీ రాజధాని అమరావతి (Amaravati) ప్రాంతంలో ప్రజలందరికీ కనిపించేలా కటౌట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వైఎస్ (YS) హయాంలో చంద్రబాబుపై 11 ఎంక్వయిరీలు చేయించినా ఏమీ నిరూపించలేకపోయారని అన్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
ఇవి కూడా చదవండి







