‘సందిగ్ధం’ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. తమ్మారెడ్డి భరద్వాజ్
సంధ్య తిరువీధుల నిర్మాణంలో తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో రానున్న చిత్రం ‘సందిగ్ధం’. ఈ మూవీలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి మెయిన్ లీడ్స్‌లో నటించగా, విలన్ రోల్ లో తెర చేప ఫేమ్ నవీన్ సంకరపు నటించారు. ఈ సినిమాని మే 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమ్మారెడ్డి భరద్వాజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో..
తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ అనే టైటిల్ చాలా బాగుంది. ఈ మధ్య అసలు టైటిల్స్ ఎలా ఉంటున్నాయో అందరం చూస్తున్నాం. ఈ సినిమాకి మాత్రం అచ్చమైన తెలుగులో టైటిల్ పెట్టారు. అడవుల్లో ఎంతో కష్టపడి మూవీని చేశారని టీజర్, ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ విషయంలో పద్దతి అంతా మారింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు వచ్చింది. అసలు చేసే ప్రమోషన్ ఎవరి వరకు రీచ్ అవుతోంది.. అనేది కూడా తెలీడం లేదు. నాలాంటి వాడికి ఇన్ స్టాగ్రాం ఉండదు. మరి నాకు ఎలా తెలుస్తుంది. ఇలాంటి చిన్న సినిమాని అందరూ ముందుండి ప్రమోట్ చేయాలి. సినిమా ఆడుతుందో లేదో తర్వాత విషయం.. అసలు మూవీ ఒకటి వస్తుందనే విషయాన్ని అందరికీ తెలియజేయాలి. అందరూ ఈ సినిమాని వీలైనంతగా ప్రమోట్ చేయాలని, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దర్శకుడు పార్ధసారథి మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ విషయంలో మీడియా మాకు ఎప్పుడూ సపోర్ట్‌గా నిలుస్తూనే ఉంది. మా కోసం ఇక్కడకు వచ్చిన తమ్మారెడ్డి గారికి థాంక్స్. ఈ ప్రయాణంలో నిర్మాత, నా భార్య సంధ్య గారు ఎంతో సహకరించారు. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఎడిటర్ విశ్వన్ రాజ్ గారు నాకెంతో సపోర్ట్ చేశారు. గౌతమ్ గారు మాకు మంచి పాటల్ని ఇచ్చారు. ‘సందిగ్ధం’తో మేం ఆశించిన విజయం దక్కుతుందని నమ్ముతున్నాను. చిన్న సినిమాల్ని తీయడం కంటే ప్రమోట్ చేయడం, రిలీజ్ చేయడం చాలా కష్టం. మే 29న మా చిత్రం రాబోతోంది. అందరూ ఎంజాయ్ చేసేలా మా సినిమా ఉంటుంది. మాకు ఆడియెన్స్ నుంచి సపోర్ట్ లభిస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
నిహాల్ మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’లో అవకాశం ఇచ్చిన పార్దు గారికి థాంక్స్. మే 29న మా సినిమా రిలీజ్ అవుతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
ప్రియా దేశ్ పాగ్ మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా సినిమా మే 29న రాబోతోంది. మా టీం అంతా నాకు సపోర్ట్ చేసింది. మా కోసం వచ్చిన తమ్మారెడ్డి గారికి థాంక్స్’ అని అన్నారు.
కాజల్ తివారి మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. అడవుల్లో ఎన్నో కష్టాలు పడి మూవీని ఫినిష్ చేశాం. మా చిత్రం మే 29న రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
అర్జున్ సిహెచ్ మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ సినిమాలో నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన పార్దు అన్నకి, సంధ్య గారికి థాంక్స్. ఫారెస్ట్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ షూటింగ్ చేశాం. తోటి ఆర్టిస్టులు నాకెంతో సపోర్ట్ చేశారు. నిహాల్, ప్రియ, కాజల్ అందరూ అద్భుతంగా నటించారు. నందన్ కృష్ణ గారి విజువల్స్ బాగుంటాయి. మే 29న మా చిత్రం రాబోతోంది. అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నటుడు ఆనంద్ మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ మూవీని సంధ్య గారు, పార్దు గారు గొప్పగా తెరకెక్కించారు. క్లైమాక్స్ వరకు ఉత్కంఠగా ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది’ అని అన్నారు.
నటుడు నవీన్ రాజ్ మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ చిత్రంలో నేను ప్రతి నాయకుడిగా నటించాను. మా కోసం వచ్చిన తమ్మారెడ్డి గారికి థాంక్స్. చిన్న సినిమాలకు ఆయనెప్పుడూ సపోర్ట్‌గా ఉంటారు. మాకు సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్స్. మాలాంటి కొత్త వారిని ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
నటుడు నాగి రెడ్డి మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ మూవీని పార్ధ సారథి అద్భుతంగా తెరకెక్కించారు. ఇది మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఇందులో మంచి కథ ఉంటుంది. మే 29న ఈ సినిమా రాబోతోంది’ అని అన్నారు.
నటుడు చిట్టి బాబు మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ సినిమాని ఎంతో సరదాగా కంప్లీట్ చేశాం. దర్శక, నిర్మాతలు మాతో ఫ్యామిలీ మెంబర్లలా కలిసిపోయారు. వారు ఇంకా ఇలానే ఎన్నో మంచి సినిమాల్ని చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటుడు గడ్డం నవీన్ మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ సినిమాలో నన్ను అడిగారు. అప్పుడు చేయలేకపోయాను. మిస్ అయినందుకు బాధగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఎడిటర్ విశ్వన్ రాజ్ మాట్లాడుతూ .. ‘‘సందిగ్ధం’ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. నిర్మాత సంధ్య గారు, దర్శకుడు పార్దు గారు ఎంతో కష్టపడి మూవీని చేశారు. మే 29న మా ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
ఈ మూవీకి గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించారు. నందన్ కృష్ణ కెమెరామెన్‌గా, విశ్వన్ రాజ్. డిఎస్ ఎడిటర్‌గా పనిచేశారు.
ఇవి కూడా చదవండి







