అందుకే ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం: బుద్దా వెంకన్న
మీడియా, పోలీసుల గురించి మాట్లాడే అర్హత జగన్ (Jagan) కు లేదని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న (Buddha Venkanna)మండిపడ్డారు. విజయవాడలో మాట్లాడుతూ వైసీపీ దాడులు, దౌర్జన్యాలను భరించలేకే ప్రజలు ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారని చెప్పారు. జగన్ హయాంలో అరాచకాలు చేసిన పోలీసులు (Police) సస్పెండ్ అయితే, చంద్రబాబు (Chandrababu) హయాంలో పనిచేసిన పోలీసులు పదోన్నతులు పొంది మంచి స్థానాల్లో ఉన్నారని తెలిపారు. సోషల్ మీడియాలో జగన్ పెడుతున్న పోస్టులపై విమర్శలు గుప్పించారు. టీడీపీ సోషల్ మీడియా ఎప్పుడూ జగన్ కు సంబంధించిన మహిళల గురించి మాట్లాడలేదని తెలిపారు. వైసీపీ సోషల్ మీడియాపై షర్మిల, సునీత స్వయంగా ఫిర్యాదు చేశారన్నారు. జగన్ తో విభేదించినందుకు షర్మిలను దూషించారని మండిపడ్డారు. రూల్ ఆఫ్ లా మరచి ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించారని, ప్రజల ఆర్తనాదాలను పట్టించుకోకుండా తాడేపల్లిలో జగన్ ఫిడేలువాయించుకున్నారని విమర్శించారు. పోలీసులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ హయాంలో సుమారు 2,800 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనపెట్టుకున్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});







