జూన్ 19, 20న వైభవంగా ‘మాటా’ రెండో మహాసభలు
MATA: మన అమెరికా తెలుగు సంఘం (MATA – మాటా) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న “మాటా రెండో మహాసభలు” (MATA 2nd Convention ’26) నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అమెరికాలోని తెలుగు సంస్కృతి, ఐక్యతను చాటిచెప్పేలా అత్యంత భారీ స్థాయిలో ఈ మెగా కన్వెన్షన్‌ను ఏర్పాటు చేశారు.
వివరాలు..
పెన్సిల్వేనియాలోని ప్రసిద్ధ ‘ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్’ (Oaks, PA) వేదికగా జూన్ 19 , జూన్ 20, 2026న రెండు రోజుల పాటు ఈ సంబరాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి
సెలబ్రిటీల సందడి..
ఈ మహాసభల్లో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు, గాయకులు, యాంకర్లు , హాస్యనటులు సందడి చేయనున్నారు.
ముఖ్య అతిథులు..
ఈ మహాసభల్లో సీనియర్ నటి జయప్రద, యాంకర్ సుమ కనకాల, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్, హీరో నిఖిల్ సిద్ధార్థ, నటుడు సుమన్, నటి ఐశ్వర్య రాజేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరితో పాటు ప్రముఖ గాయకులు రామ్ మిరియాల, సమీరా భరద్వాజ్, రీటా, సాగర్, కార్తీక్ మాల్యాల బృందంచే లైవ్ మ్యూజికల్ పెర్ఫార్మెన్స్, అలాగే రామచారి సంగీత కార్యక్రమం ప్రేక్షకులను అలరించనున్నాయి.
వినోదాల హంగామా..
హాస్యనటులు అలీ, శివారెడ్డి, మిమిక్రీ రమేష్, అధిరే అభి, సుధాకర్, మఖ్దూమ్ సయ్యద్ , ఆర్జే భార్గవి, నిఖిల్ల యాంకరింగ్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
లైవ్ కాన్సర్ట్‌లు, సాంస్కృతిక ప్రదర్శనలు, కమ్యూనిటీ నెట్వర్కింగ్, రుచికరమైన విందు వినోదాలతో కూడిన ఈ మహా ఈవెంట్లో ప్రవాసాంధ్రులంతా కుటుంబ సమేతంగా పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. ఈ మెగా కన్వెన్షన్‌లో భాగస్వామ్యం కావడానికి అధికారిక వెబ్సైట్ (www.convention.mata-us.org) ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా మాటా ప్రతినిధులు కోరారు.
ఇవి కూడా చదవండి







