చరణ్ ప్లాన్.. పవన్ ఎంట్రీ.. పెద్ది రిలీజ్‌పై టాలీవుడ్లో భారీ ట్విస్ట్!
టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న పెద్ది(Peddi) ఒకటి. బుచ్చిబాబు సానా(Buchibabu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా రికార్డు స్థాయి రిలీజ్‌కు సిద్ధమవుతోంది. గత రెండు నెలలుగా థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ తగ్గిపోవడంతో ఎగ్జిబిటర్లు తీవ్ర ఆందోళనలో ఉన్న పరిస్థితుల్లో, పెద్ది సినిమాపైనే ఇండస్ట్రీ మొత్తం ఆశలు పెట్టుకుంది. మంచి టాక్ వస్తే ఈ సినిమా థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో భారీ రిలీజ్‌కు రంగం సిద్ధమవుతున్నప్పటికీ, ప్రస్తుతం కొనసాగుతున్న పర్సెంటేజ్ సిస్టమ్ డిమాండ్లు కొంత ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈ నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ని కలిసి పరిస్థితిని వివరించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్‌కు చెందిన యాక్టివ్ నిర్మాతలు ఎస్ నాగవంశీ(S Naga Vamsi), వెంకట సతీష్ కిలారు(Venkata Satish Kilaru), సాహు గారపాటి(Sahu Garapati), మైత్రి రవి(Mythri Ravi), సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) కలిసి రాజమండ్రిలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ను కలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పెద్ది సినిమాకు గ్రాండ్ రిలీజ్ ఉండేలా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే సమయంలో పర్సంటేజ్ విధానం అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
అసలు ఈ భేటీ వెనుక కూడా రామ్ చరణ్ కీలక పాత్ర పోషించినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. పెద్ది నిర్మాత వెంకట సతీష్ కిలారుకు పవన్ కళ్యాణ్‌ను కలిసి సమస్యను వివరించాలని చరణ్ సూచించినట్లు సమాచారం. దీంతో నిర్మాతలు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకుని పవన్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ఈ వీకెండ్‌కి తెలంగాణలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి సమస్యలు లేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వృద్ధి సినిమాస్(Vriddhi Cinemas), మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్(Sukumar Writings) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టాలీవుడ్లో ఈ ఏడాది అత్యంత భారీ రిలీజ్‌లలో ఒకటిగా నిలవనుంది.
ఇవి కూడా చదవండి







