స్పిరిట్ మూవీ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
స్పిరిట్(Spirit) మూవీ షూటింగ్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) సినిమా పనులను ఊహించని స్పీడ్‌లో ముందుకు తీసుకెళ్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి చేసిన చిత్రబృందం, ఇప్పుడు నగరంలోని కోటి ఉమెన్స్ కాలేజీకి మకాం మార్చనున్నట్లు సమాచారం. రేపటి నుంచి అక్కడ ప్రత్యేక షెడ్యూల్ ప్రారంభం కానుందనే వార్త టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. షూటింగ్ కోసం కాలేజీ పరిసరాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈ కొత్త షెడ్యూల్లో ప్రభాస్(Prabhas), త్రిప్తి డిమ్రీ(Tripti Dimri)పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హై ఇంటెన్స్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో కనిపించే ఎమోషనల్ టెన్షన్, రియలిస్టిక్ యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సన్నివేశాల్లో కూడా హైలైట్ అవుతాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు ఆయన చేసిన క్యారెక్టర్లతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా ఉండబోతుందనే ప్రచారం అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. రీసెంట్ గా రిలీజైన పోస్టర్‌కే వచ్చిన రెస్పాన్స్ చూస్తేనే సినిమా హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
టీ సిరీస్(T Series), భద్రకాళి పిక్చర్స్(Bhadrakali Pictures) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్(Vivek Oberai) విలన్‌గా నటిస్తుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రభాస్- వివేక్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ సినిమాకు ప్రధాన హైలైట్ అవుతాయని సమాచారం. హర్షవర్ధన్ రామేశ్వర్(Harshavardhan Rameswar) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.







