ఆగస్టు 1న సిలికానాంధ్ర రజతోత్సవ సంబరాలు
SiliconAndhra: ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రతిష్టాత్మక సంస్థ “సిలికానాంధ్ర” (SiliconAndhra) 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సంబరాలకు (Silver Jubilee Celebrations) సిద్ధమైంది. ‘తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి’ నినాదంతో ఈ చారిత్రాత్మక వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ మహోత్సవం ఆగస్టు 1, 2026 (శనివారం) రోజు కాలిఫోర్నియాలోని ప్రసిద్ధ ఓక్లాండ్ ఎరీనా (Oakland Arena) వేదికగా జరగనుంది. 25 ఏళ్ల తెలుగు వారసత్వ వైభవాన్ని, ఖ్యాతిని చాటిచెప్పేలా ఈ వేడుకలను ఏర్పాటు చేశారు.
ఈవెంట్ వివరాలు..
- తేదీ: ఆగస్టు 1, 2026 (శనివారం)
- వేదిక: ఓక్లాండ్ ఎరీనా, కాలిఫోర్నియా (Oakland Arena, California)
- అధికారిక లింక్: silverjubilee.siliconandhra.org
ఈ మహా సమ్మేళనంలో సిలికానాంధ్ర అనుబంధ సంస్థలైన ‘మనబడి’, ‘సంపద’ (మ్యూజిక్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ), ‘రోటరీ క్లబ్ ఆఫ్ సిలికానాంధ్ర’, ‘ఏరియా యూనివర్సిటీ’, ‘రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’, , ‘సంకల్ప’ (నాటక కళా పరిషత్) భాగస్వామ్యం వహిస్తున్నాయి.
తెలుగు సంస్కృతి, కళలపై మక్కువ ఉన్న ప్రవాసాంధ్రులంతా ఈ చారిత్రాత్మక రజతోత్సవ సంబరాలలో పాల్గొని విజయవంతం చేయాలని, దీనికోసం అధికారిక వెబ్సైట్ ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.







