కేంద్రం నా అమెరికా పర్యటనను అడ్డుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం : సీఎం రేవంత్ రెడ్డి
సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…
రాష్ట్రాల కలయికనే కేంద్ర ప్రభుత్వం. ఇది భారత దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి
విద్య, క్రీడలు, పెట్టుబడులు లక్ష్యంగా మా విదేశీ పర్యటన కార్యాచరణ రూపొందించుకున్నాం
తెలంగాణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకుని ముందుకెళుతోంది
విదేశీ పర్యటనకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖకు పూర్తి సమాచారం అందించాం
విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ
ఇంగ్లాండ్ కు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించింది
ఈ విషయంలో కేంద్రం వైఖరిని అందరూ తప్పు పట్టారు
నా పర్యటనను తిరస్కరించడమే కాకుండా బీజేపీ నాయకులు రాజకీయంగా నాపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు
బీజేపీ నాయకులు విచక్షణ కోల్పోయి ప్రభుత్వంపై, అధికారిక పర్యటనపై తప్పుడు ప్రకటనలు చేశారు
బీజేపీ వైఖరిపై రాజకీయ అంశాలను నేను ప్రస్తావించదలచుకోలేదు.
ఇది రెండు ప్రభుత్వాలకు సంబంధించిన అంశం
అమెరికా పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సమర్పించాం
రాజకీయపరమైన నిర్ణయాలతో పర్యటనను తిరస్కరిస్తున్నామని చెప్పారు
ఆ రాజకీయ కారణాలు ఏమిటో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాలి
ఆగస్టు 17 నుంచి 28 వరకు అమెరికా, కెనడా పర్యటనకు గుజరాత్ ముఖ్యమంత్రికి అనుమతించారు
వైబ్రంట్ గుజరాత్ అని పెట్టుబడుల కోసం గుజరాత్ ముఖ్యమంత్రికి అనుమతి ఇచ్చారు
కానీ తెలంగాణ రైజింగ్ 2047 లో భాగంగా అమెరికాలో పర్యటించాలనుకుంటే అడ్డుకున్నారు
నిజంగా నా విదేశీ పర్యటనలో విషయం లేదనుకుంటే ఇంగ్లాండ్ కు ఎందుకు అనుమతి ఇచ్చారు? అమెరికాకు ఎందుకు తిరస్కరించారు?
మహాత్మా గాంధీ, అంబేడ్కర్ ఇంగ్లాండ్ లో చదువుకుని దేశానికి దార్శనికులుగా మారారు
ఆర్ధికంగా వెనకబడిన వారు విదేశాల్లో చదువుకునే పరిస్థితి ఉండదు
విదేశీ చదువులను, క్రీడలను ఇక్కడికి తీసుకురావాలని మేం ప్రయత్నిస్తున్నాం
ఇందుకు విదేశీ పర్యటనలు ఉపయోగపడుతాయని భావించాం
ప్రధాని ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు తప్ప భారత ప్రధానిగా వ్యవహరించడం లేదు
ఇది రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా జరిగిన అవమానం కాదు
ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం
దీనినిని రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉంది
తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనను కేంద్రం అడ్డుకోవడం తెలంగాణ అభివృద్ధిని వ్యతిరేకించడమే
కేంద్రం వైఖరి చూస్తోంటే స్పష్టంగా తెలంగాణపై వివక్ష కనిపిస్తోంది
మా ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తారు
గుజరాత్ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందనే నా పర్యటనను కేంద్రం అడ్డుకుంది
ఇది రాజకీయ వివక్ష… తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే
మేమంతా కేంద్రం వైఖరిని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం
ఇది ఫెడరల్ సూర్తికి విరుద్ధం
నా పర్యటనను అడ్డుకోవచ్చు.. నా లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుకోలేరు
ఇన్వెస్ట్ తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ను డిసెంబర్ 8,9 తేదీల్లో నిర్వహిస్తున్నాం
విద్య, క్రీడల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తాం
ముఖ్యమంత్రి సరైన వివరాలు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు..
ఇది అధికారిక పర్యటన.. మా కార్యక్రమాలు అన్నీ భారత రాయబార కార్యాలయం పర్యవేక్షణలో జరుగుతుంది
ఇది చాటు మాటుగా జరిగే వ్యవహారం కాదు..
అన్ని వివరాలను విదేశీ వ్యవహారాల శాఖకు అందించాం
తెలంగాణ అంటే మోదీకి వివక్ష.. చిన్న చూపు..
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు గుజరాతీ నాయకత్వం చేస్తున్న కుట్ర
రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉండొచ్చు… కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలి
కేంద్రం వైఖరి సత్సంబంధాలను దెబ్బతీసేలా ఉంది
ప్రధాని మోదీ, బీజేపీ ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లొచ్చు కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా నా పర్యటనను అడ్డుకుంటారట
కేంద్రం వైఖరితో తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోతాయన్నదే మా ఆవేదన
తెలంగాణ అభివృద్ధి కోసం కచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం








