ఏపీ పర్యటనకు ఉపరాష్ట్రపతి.. స్వాగతం పలికిన మంత్రి లోకేశ్
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం.
ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికిన మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్, వర్ల కుమార్ రాజా, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
గన్నవరం నుంచి నూజివీడు నియోజకవర్గం ముసునూరు బయలుదేరిన ఉప రాష్ట్రపతి.
ముసునూరులో గౌర్మెట్ పాప్ కార్నికా రూపొందించిన నూతన హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరించనున్న ఉప రాష్ట్రపతి.
ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి హాజరు కానున్న మంత్రి లోకేష్.








