శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం సరికాదు : టీటీడీ
తిరుమల శ్రీవారి లడ్డూ ( Srivari Laddu) ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతున్న వీడియోపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది. అత్యంత పవిత్ర, పరిశుభ్రత ప్రమాణాలను పాటించి లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్నామని, దీనిపై దుష్ప్రచారం తగదని తెలిపింది. టీటీడీ ( TTD) ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో స్వామివారి లడ్డూ ప్రసాదంపై భక్తుల్లో అపోహలు కలిగించేలా వీడియోలు (Videos) రూపొందించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం సరికాదని పేర్కొంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించ వద్దని విజ్ఞప్తి చేసింది. భక్తులు ఇలాంటి వీడియోలను సామాజిక మాధ్యమల్లో షేర్ చేయకుండా, ఏదైనా అనుమానాస్పద విషయం కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరింది.








