ఇరుముడి సినిమాలో ఆ సన్నివేశాలను తొలగించాలి : ఏపీటీఎఫ్ డిమాండ్
ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను కించపరిచేలా ఉన్న ఇరుముడి (Irumudi ) సినిమాలోని సన్నివేశాలను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల (Chennupati Manjula), బసవలింగారావు ( Basavalinga Rao) డిమాండ్ చేశారు. సినిమా సమాజాన్ని ప్రభావితం చేసే శక్తిమంతమైన మాధ్యమం. ఒక పాత్రను తెరపై ఎలా చూపిస్తారో అదే ముద్రగా సమాజంలో మిగిలిపోతుంది. ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులు (Teachers), విద్యార్థులు వంటి అంశాలను తెరపై చూపించేటప్పుడు దర్శకులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి.
ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని పాత్రను అత్యంత ప్రతికూలంగా తీర్చిదిద్దారు. అది కేవలం కల్పిత పాత్ర కాదు. ఆమె వెనుక ఆంధ్రప్రదేశ్లోని ఒక పాఠశాల కనిపిస్తుంది. ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులు ధరించిన యÖనిఫామ్ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ధరించే యÖనిఫామ్ ఒక్కటే. అల్లూరి సీతారామరాజు జిల్లా ( Alluri Sitarama Raju district) సీలేరు జిల్లా పరిషత్తు పాఠశాల పేరుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులపై తీసిన ఈ సినిమా ఉపాధ్యయ వృత్తిని, పాఠశాల విద్యా వ్యవస్థను కించపరిచే విధంగా ఉంది అని పేర్కొన్నారు.








