సంక్రాంతికి సీనియర్ హీరోల సినిమాల మధ్య రచ్చ
తెలుగు సినీ పరిశ్రమలో 2027 సంక్రాంతి పోరు ఇప్పటినుంచే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోలు ఒకేసారి బరిలోకి దిగే అవకాశాలు కనిపించడంతో అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna), అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మధ్య మరోసారి బాక్సాఫీస్ ఫైట్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నాగార్జున తన కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా లాటరీ కింగ్(Lottery King) తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుండగా, బాలయ్య(Balayya) మాత్రం కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ సినిమాతో సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీంతో సీనియర్ స్టార్ వార్ మళ్లీ మొదలవుతుందా? అన్న చర్చ ఊపందుకుంది.
బాలయ్య- నాగ్ మధ్య బాక్సాఫీస్ పోటీకి తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. గతంలో పలు సందర్భాల్లో ఈ ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలై ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపాయి. ఇప్పుడు మళ్లీ అదే రైవల్రీ మరోసారి రిపీట్ కావొచ్చనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
ఒకవైపు బాలయ్యకు సంక్రాంతి సీజన్లో ఉన్న బలమైన ట్రాక్ రికార్డ్, మరోవైపు నాగార్జునకు ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న ఇమేజ్ ఈ పోటీని మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటీటీ యుగంలో కూడా సీనియర్ హీరోల మార్కెట్ ఎంత బలంగా ఉందో ఈ క్లాష్ నిరూపించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఈ సంక్రాంతి పోటీ ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)- బాబీ(bobby) మూవీ, విక్టరీ వెంకటేశ్(Venkatesh)- అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ మూవీ కూడా అదే సీజన్‌ను టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. దీంతో 2027 పొంగల్ సీజన్ టాలీవుడ్ హిస్టరీలోనే అతిపెద్ద మల్టీ స్టార్ క్లాష్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చలు, ఫ్యాన్ పోస్టర్లు, బాక్సాఫీస్ అంచనాలు వైరల్ అవుతున్నాయి. థియేటర్ల కేటాయింపుల నుంచి కలెక్షన్ల వరకూ తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉన్నప్పటికీ, ఇదే టాలీవుడ్‌కు భారీ వ్యాపారం తీసుకొచ్చే సంక్రాంతిగా మారవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి







