పార్టీ పుట్టుక నుండి నేటి వరకు … అన్నీ సంచలనాలే : సీఎం చంద్రబాబు
విజన్ పాలిటిక్స్ కు తెలుగుదేశం పార్టీ నాంది అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మహానాడు (Mahanadu) వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్ని అద్భుతాలేనని, ప్రతి అడుగు సంచలనమేనని పేర్కొన్నారు. 1875 క్లస్టర్ల వేదికగా ఈసారి మహానాడు జరుగుతోందని తెలిపారు. లక్షలాదిమంది కార్యకర్తలు తొలిరోజే అదరగొట్టారని ప్రశంసించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని 44 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలనను టీడీపీ (TDP) పరిచయం చేసిందని ప్రస్తావించారు. జెండర్ ఈ క్వాలిటీ, సామాజిక సమస్యలపై తెలుగుదేశం పోరాడిందని పేర్కొన్నారు.
వర్చువల్ మహానాడు కారణంగా వాహానాల హోరు తగ్గిందేమో కానీ, కార్యకర్తల్లో జోరు మాత్రం తగ్గలేదని చెప్పుకొచ్చారు. జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి గౌరవం, ఆత్మవిశ్వాసమని ఉద్ఘాటించారు. ప్రతీ ఒక్కరికీ తెలుగుదేశం జెండా చూస్తేనే నమ్మకం, భరోసా కలుగుతోందని తెలిపారు. నాటికి, నేటికి టీడీపీపై ప్రజలకు ఆదరణ చెక్కు చెదరలేదని చెప్పారు. 45 ఏళ్లుగా ప్రజాసమస్యల కోసం టీడీపీ నిరంతర పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల్లో బీజేపీ (BJP), జనసేన (Janasena)తో కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నాం.
ఇవి కూడా చదవండి







