మహానాడు వేదికగా మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
తెలుగుదేశం పార్టీలో ఇకపై మహిళల (Women’s)కు 33 శాతం సీట్లు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ (Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ (Parliament)లో బిల్లు పాసైనా, అవ్వకపోయినా పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. బిగ్ అనౌన్స్మెంట్ అని ఉదయం పెట్టిన పోస్టుకు అనుగుణంగా తన ప్రసంగంలో మహిళలకు రిజర్వేషన్ అంశాన్ని ప్రకటించారు.
టీడీపీ సిద్ధాంతాలే మన బలం. రాష్ట్రానికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటే అదీ సీబీఎన్ (CBN) కృషి వల్లే. సంక్షేమం, అభివృద్ధిపై చర్చను నేను సిద్ధం. మీరు సిద్ధమా? వైసీపీ వేధింపులు తట్టుకోలేక నంద్యాలలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఎంతో మంది బీసీ, ఎస్టీ, మైనారిటీ సోదరులను చంపేశారు. అక్కను వేధించవద్దన్న అమర్నాథ్ గౌడ్ (Amarnath Goud)ను ఏకంగా కిరోసిన్ పోసి చంపేశారు. దళిత డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. గొడ్డలి పార్టీ అంటే వైసీపీకి కోపం వచ్చింది. మాది గూగుల్, మీది గొడ్డలి. మాది ఫైటర్ జెట్ మీది ఫ్యాక్షన్. మాది కియా అయితే, మీది కిడ్నాప్ అని విమర్శించారు.
ఇవి కూడా చదవండి







