జూలై 10 నుండి ATA సీయాటిల్ ఆధ్వర్యంలో ‘లెట్స్ గో క్యాంపింగ్’
ATA: అమెరికా తెలంగాణ సంఘం సీయాటిల్ (ATA-Seattle) చాప్టర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ప్రతిష్టాత్మకమైన సమ్మర్ క్యాంపింగ్ ఈవెంట్ “లెట్స్ గో క్యాంపింగ్” (Let’s Go Camping) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిత్య జీవిత ఒత్తిళ్లకు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు దూరంగా, ఆహ్లాదకరమైన పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా ఈ క్యాంపింగ్‌ను డిజైన్ చేశారు.
వివరాలు..
జూలై 10, 2026 (శుక్రవారం) సాయంత్రం 4:00 గంటల నుండి జూలై 12, 2026 (ఆదివారం) ఉదయం 11:00 గంటల వరకు 3 రోజుల పాటు ఈ వేడుక సాగనుంది.
ప్రధాన ఆకర్షణలు..
యాక్టివిటీస్: హైకింగ్ ట్రైల్స్, మార్నింగ్ యోగా, క్యాంప్ ఫైర్, వాచ్ స్ట్రీట్ మూవీ.
ఆటలు: వాలీబాల్, గల్లీ క్రికెట్, బాడ్మింటన్, ఖోఖో, ట్రెజర్ హంట్ , స్పెషల్ అంత్యాక్షరి.
ప్రత్యేకతలు: సాంప్రదాయ వంటకాలు, రోయింగ్ బోట్స్ , ఫిషింగ్. (బోట్ రైడ్ ప్రత్యేక రుసుముతో లభ్యమవుతుంది).
వివరాలు & మార్గదర్శకాలు..
వేదిక: బ్లూ లేక్ రిసార్ట్, 31199 HWY-17 N, కూలీ సిటీ (Coulee City), WA 99115.
టెంట్స్: క్యాంపింగ్‌కు వచ్చే వారు తమ స్వంత టెంట్లను తెచ్చుకోవాల్సి ఉంటుంది (నిర్వాహకులు టెంట్లు అందించరు).
క్యాబిన్లు, డోమ్స్ , సైట్ల కేటాయింపు ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్’ (ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ప్రాధాన్యత) పద్ధతిలో ఉంటుంది.
స్వంత ఆర్వీ (RV) ఉన్నవారు ఏటీఏ-సీయాటిల్ బోర్డును సంప్రదించవచ్చు. రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్స్ ఏవీ రీఫండ్ చేయరు. మిగిలిన నిధులను కమ్యూనిటీ సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు.
కార్యవర్గ సభ్యులు..
శ్రీనివాస్ రెడ్డి బండారపు, పరుష మర్రి, హేమంత్ గండవరపు, చందు అల్లిపురం, కృష్ణ కాంత్ పసుమర్తి, సోమేష్ కుమార్ మలిశెట్టి, సంతోష్ దూదం, శ్రీనివాస్ గజవాడ
ఈ అద్భుతమైన వేసవి క్యాంపింగ్‌లో పాల్గొనడానికి ఆసక్తి గలవారు ఫ్లయర్లోని క్యూఆర్ (QR) కోడ్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏటీఏ సీయాటిల్ కార్యవర్గ సభ్యులు కోరారు.







