మే 1 నుంచి అమెరికా తెలంగాణ సంఘం – సీయాటిల్ ‘100 మైళ్ల ఛాలెంజ్’
ATA: ప్రవాస భారతీయులలో ఆరోగ్య స్పృహను పెంపొందించేందుకు అమెరికా తెలంగాణ సంఘం – సీయాటిల్ (ATA-Seattle) తమ వినూత్న కార్యక్రమం”100 మైళ్ల ఛాలెంజ్” (100 Mile Challenge)ను మళ్లీ ప్రారంభించనుంది. “ఒకసారికి ఒక అడుగు” (One Step at a Time) అనే నినాదంతో మే నెల అంతటా ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ కొనసాగనుంది.
- ఛాలెంజ్ వివరాలు..
- ప్రారంభం: మే 1, 2026
- ముగింపు: మే 31, 2026
- లక్ష్యం: 100 మైళ్ల నడకను నెల రోజులలో పూర్తి చేయడం.
ఇవి కూడా చదవండి
పాల్గొనే విధానం, నిబంధనలు:
- పాల్గొనేవారు తమ నడకను ట్రాక్ చేయడానికి ఉచిత ‘Pacer App’ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- ప్రతిరోజూ గరిష్టంగా 12,000 అడుగుల వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
- 24 గంటల సమయంలో మీకు వీలైనప్పుడు ఈ నడకను పూర్తి చేయవచ్చు.
- 100 మైళ్లు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ప్రత్యేక మెడల్ (Medal) బహుకరిస్తారు.
నిర్వాహక బృందం..
ఈ కార్యక్రమాన్ని ATA-సీయాటిల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి బండారపు నేతృత్వంలోని కార్యవర్గ సభ్యులు పరుశ మర్రి (వైస్ ప్రెసిడెంట్), హేమంత్ గంటావరపు (జనరల్ సెక్రటరీ), చందు అల్లిపురం (కల్చరల్ సెక్రటరీ), కృష్ణకాంత్ పసుమర్తి (ట్రెజరర్), రొమేష్ కుమార్ మలిశెట్టి (PR డైరెక్టర్), సంతోష్ దుగం , శ్రీనివాస్ గజవాడ పర్యవేక్షిస్తున్నారు.
ఛాలెంజ్ ఉద్దేశ్యం..
శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం , కమ్యూనిటీని ఏకం చేయడం ఈ ఛాలెంజ్ ప్రధాన ఉద్దేశ్యం. సీయాటిల్ ప్రాంతంలోని తెలుగు వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆరోగ్యవంతమైన జీవనశైలి వైపు అడుగులు వేయాలని నిర్వాహకులు కోరారు. అవార్డు ప్రధానోత్సవ వేదికను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
మరిన్ని వివరాలకు https://ataseattle.org/ వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా info@ataseattle.org కు మెయిల్ చేయవచ్చు.
ఇవి కూడా చదవండి







