ఎల్లమ్మలో మలయాళ బ్యూటీ?
టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న సినిమా ఎల్లమ్మ(Yellamma). గ్రామీణ భావోద్వేగాల నేపథ్యంతో డైరెక్టర్ వేణు ఎల్దండి(Venu Yeldandi) తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి నుంచే ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలకు కారణమవుతోంది. ముఖ్యంగా హీరో ఎంపిక విషయంలో పలుమార్లు మార్పులు చోటుచేసుకోవడం, చివరకు దేవిశ్రీ ప్రసాద్ పేరు ఖరారవడం ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టిని తీసుకొచ్చింది. సంగీత దర్శకుడిగా తన ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డీఎస్పీ, ఈసారి పూర్తి స్థాయి నటుడిగా ఎలా మెప్పిస్తాడో అన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇక హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా ఎల్లమ్మ టీమ్ ఎన్నో ఆలోచనలు చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొదట సాయి పల్లవి(Sai Pallavi) పేరు ప్రచారంలోకి రాగా, తర్వాత మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) పేరు బలంగా వినిపించింది. అయితే తాజాగా మలయాళ యువ నటి మమిత బైజు(Mamitha Baiju) పేరు ఈ ప్రాజెక్ట్‌తో జతకట్టడం ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన మమితా, తన నేచురల్ యాక్టింగ్ తో ఇప్పటికే సౌత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఎల్లమ్మ లాంటి భావోద్వేగ ప్రధాన కథలో ఆమె కనిపిస్తే కొత్త ఫీల్ తీసుకురాగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు గ్రామీణ నేపథ్య కథల్లో కొత్త ముఖాలు ఎక్కువ ప్రభావం చూపుతాయనే సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీలో ఉంది. అదే కారణంగా మమితా ఎంపిక జరిగి ఉండొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆమె చేసిన పాత్రల్లో కనిపించిన నేచురల్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, గ్లామర్‌కే పరిమితం కాకుండా ఎమోషనల్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా బలంగా మోయగలదనే నమ్మకం పెరిగింది. అయితే ఈ ప్రచారాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పటివరకు ఎల్లమ్మ హీరోయిన్ సస్పెన్స్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి







