జపాన్ కలారూపమైన బోన్సాయ్ పద్ధతిలో, చిన్న కుండీలోనే పూర్తి పరిమాణం, రుచి గల నిమ్మకాయలను సులువుగా పండించవచ్చు.
తక్కువ వేర్లతో కుండీలో పెరగడానికి 'Meyer Lemon' లేదా 'Ponderosa' వంటి డ్వార్ఫ్ (Dwarf) రకాలు అత్యంత అనుకూలం.
సాధారణ మట్టి కాకుండా.. అకాడమా, పీట్ మాస్, కంపోస్ట్ కలిపిన తేలికపాటి, pH 5.5-6.5 ఉన్న ఆమ్లత్వ మట్టిని వాడాలి.
నిమ్మ చెట్టు బాగా కాపు కాయాలంటే రోజుకు కనీసం 6 నుండి 8 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తగిలేలా ఉంచాలి.
మట్టి పైపొర ఆరినప్పుడే నీరు ఇవ్వాలి. ఎక్కువ నీరైతే వేర్లు కుళ్ళిపోతాయి, తక్కువ నీరైనా మొక్క తట్టుకోగలదు.
ఎముకల పొడి (Bone meal), ఆవు పేడ, వర్మీకంపోస్ట్ లేదా ఎండిన అరటిపండు తొక్కల పొడిని నెలకు ఒకసారి ఇస్తే కాత బాగా వస్తుంది.
ఆకులు వచ్చిన ప్రతిసారీ 2 ఆకులు మిగిల్చి కత్తిరించాలి. ఇది మొక్కను గుబురుగా మార్చి, ఎక్కువ కాతను ఇస్తుంది.
మొక్కను ఇంట్లో పెంచితే పూలు రాలకుండా ఉండటానికి, చిన్న బ్రష్‌తో చేతి ద్వారా పరాగసంపర్కం (Hand Pollination) చేయాలి.
సరైన ఎండ, పొడి మట్టి, ప్రతి 2-3 ఏళ్లకు రీపాటింగ్, క్రమం తప్పని కత్తిరింపుతో మీ బోన్సాయ్ నిమ్మకాయలతో నిండిపోతుంది!