క్రిష్ నెక్ట్స్ ఏంటి?
టాలీవుడ్లో కంటెంట్ ఆధారిత సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) ఒకరు. గమ్యం(Gamyam), వేదం(Vedam), కృష్ణం వందే జగద్గురుం(Krishnam vande Jagadgurum), కంచె(Kanche), గౌతమీపుత్ర శాతకర్ణి(Gauthamiputra Satakarni) వంటి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఎమోషన్స్ ను నేచురల్ గా చూపించే విధానం, సామాజిక అంశాలను కమర్షియల్ టచ్‌తో చెప్పే తీరు కృష్ కు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే గత కొన్నేళ్లుగా ఆయన కెరీర్ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఎన్టీఆర్ బయోపిక్(NTR Biopic) నిరాశపరిచిన తర్వాత వచ్చిన కొండపొలం, తాజాగా రిలీజైన ఘాటీ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఒకప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరొందిన కృష్ వరుస పరాజయాలతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
ఇక హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడం కూడా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ సినిమా బాధ్యతలను తరువాత దర్శకుడు ఏఎం జ్యోతి కృష్ణ(AM Jyothikrishna) తీసుకున్నారు. మరోవైపు బాలకృష్ణతో తెరకెక్కాల్సిన ఆదిత్య 999(Aditya999) ప్రాజెక్ట్‌పై కూడా కృష్ పేరు వినిపించినా, ఆ సినిమాకు ఆయన దూరమైనట్లు సమాచారం. ఈ పరిణామాలన్నీ కలిసి కృష్ కెరీర్‌పై అనేక సందేహాలు రేకెత్తించాయి. అయినప్పటికీ కథల ఎంపికలో ఆయనకున్న ప్రత్యేక దృష్టిపై సినీ వర్గాల్లో ఇప్పటికీ నమ్మకం ఉంది.
ఈ నేపథ్యంలో కృష్ తాజాగా కొత్త సినిమాను ప్రారంభించినట్లు సమాచారం. యంగ్ నటీనటులతో రూపొందుతున్న ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా, ఎంటర్టైన్మెంట్తో కూడిన కథగా తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఆయన సొంత నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్(First Frame Entertainments) నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ నిశ్శబ్దంగా కొనసాగుతుండగా, వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, కృష్ ఈ సినిమాతో బలమైన కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.







