29th May 2026

___________

- Saidulu

మామిడిపండ్లు సహజంగా ముగ్గించే సులభమైన చిట్కాలు..

వేసవి వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే. ముఖ్యంగా రసాలు , బంగినపల్లి మామిడిపండ్ల కోసం మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంటుంది. అయితే త్వరగా పండించేందుకు కొన్ని చోట్ల రసాయనాలు వాడటం ఆందోళన కలిగిస్తోంది.

కాల్షియం కార్బైడ్ వంటి కెమికల్స్‌తో పండించిన మామిడిపండ్లు బయటకు బాగానే కనిపించినా, సహజ రుచి మాత్రం ఉండదు. ఇలాంటి పండ్లు ఆరోగ్యానికి కూడా హానికరమని నిపుణులు చెబుతున్నారు.

మందు వేసి పండించిన పండ్ల కంటే సహజంగా పండిన మామిడిపండ్లలోనే నిజమైన తీపి, వాసన ఉంటుందని చెబుతున్నారు.

ఎండుగడ్డి ఉపయోగించి మామిడిపండ్లు మగ్గించడం పాతకాలం నుంచీ వస్తున్న పద్ధతి. పెట్టెలో గడ్డి పరచి పండ్లు అమర్చి మళ్లీ గడ్డితో కప్పితే కొన్ని రోజుల్లో సహజంగా పండిపోతాయి.

ఈ విధంగా పండిన పండ్లకు సహజమైన రంగు, మంచి వాసన వస్తుంది. రుచి కూడా కెమికల్స్‌తో పండించిన వాటికంటే చాలా మెరుగ్గా ఉంటుంది.

జనపనార సంచులు లేదా మందపాటి పత్తి వస్త్రంతో కప్పే పద్ధతిని కూడా చాలామంది ఉపయోగిస్తున్నారు. లోపల ఏర్పడే సహజ వేడి వల్ల పండ్లు మెల్లగా మగ్గుతాయి.

తక్కువ పరిమాణంలో ఉన్న మామిడిపండ్లను బియ్యం లేదా గోధుమల్లో ఉంచినా త్వరగా పండుతాయి. ధాన్యంలో ఉండే వేడి కారణంగా రెండు మూడు రోజుల్లోనే మంచి రుచిని అందుకుంటాయి.

కొంతమంది వార్తాపత్రికలో పండ్లు చుట్టి, పక్కన ఉల్లిపాయలు ఉంచే పద్ధతిని పాటిస్తున్నారు. ఉల్లిపాయల నుంచి వెలువడే సహజ వాయువు మామిడిపండ్లు త్వరగా మగ్గేందుకు సహాయపడుతుంది.

మామిడిపండ్లు సహజంగా పండించేటప్పుడు శుభ్రత కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజూ వాటిని పరిశీలిస్తూ పండిన పండ్లను వేరుగా తీస్తే మంచి నాణ్యతతో మామిడిపండ్లను ఆస్వాదించవచ్చు.