జూన్ 13న ఘనంగా TAGCA గ్రాడ్యుయేషన్ సెరిమనీ
TAGCA: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షార్లెట్ ఏరియా (TAGCA) ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులను గౌరవిస్తూ TAGCA గ్రాడ్యుయేషన్ సెరిమనీ 2026″ (TAGCA Graduation Ceremony 2026) వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ‘క్లాస్ ఆఫ్ 2026’ గ్రాడ్యుయేట్లు , వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఈ వేడుకను ఏర్పాటు చేశారు.
వివరాలు..
ఈ వేడుక 2026 జూన్ 13వ తేదీ శనివారం మధ్యాహ్నం 3:00 గంటల నుండి ప్రారంభం కానుంది. ఫోర్ట్ షార్లెట్ లోని ‘అన్నే స్ప్రింగ్స్ క్లోజ్ గ్రీన్వే, 195 అడ్వెంచర్ రోడ్’ (Anne Springs Close Greenway, 195 Adventure Rd, Fort Charlotte A) వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుక అందరికీ ప్రవేశం ఉండేలా (Open to All) ఓపెన్ ఈవెంట్‌గా నిర్వహించనున్నారు.
ఈ ఈవెంట్ లోని అంశాలు..
- డీజే సెలబ్రేషన్ (DJ Celebration): లైవ్ డీజే, మ్యూజిక్, డ్యాన్స్ , పార్టీ వైబ్స్.
- పర్సనల్ పోర్ట్రెయిట్స్ (Personal Portraits): గ్రాడ్యుయేట్ల కోసం ప్రొఫెషనల్ , మెమరబుల్ ఫోటోషూట్ ఏర్పాట్లు.
- ఇన్స్పైరింగ్ స్పీచెస్ (Inspiring Speeches): కమ్యూనిటీ లీడర్స్ , విజనరీస్ చేత స్ఫూర్తిదాయక ప్రసంగాలు.
- స్నాక్స్ & ఫుడ్ (Snacks & Food): ఈవెంట్ లో భాగంగా రుచికరమైన స్నాక్స్ , ఫుడ్ సరఫరా.
- ఉచిత గిఫ్ట్ కార్డ్‌లు (Free Gift Cards): ఎగ్జైటింగ్ గిఫ్ట్ కార్డ్ గివ్అవేస్ , ప్రైజెస్.
- ఉచిత ఆనర్ కార్డ్ (Free Honor Cord): ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఉచితంగా సెరిమోనియల్ ఆనర్ కార్డ్ బహూకరణ.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ వేడుకలో పాల్గొనాలనుకునే వారు ఆన్లైన్ ద్వారా (https://tinyurl.com/TAGCAGRAD) తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు లేదా సందేహాల కోసం రమేష్ ముకుళ్ళ (Ramesh Mukulla) ను 860-709-0082 నంబర్ ద్వారా సంప్రదించవచ్చని టాగ్కా కమ్యూనిటీ ప్రతినిధులు తెలిపారు.







