ఆ పార్టీ హయాంలో విద్యావ్యవస్థ నాశనం : ఎమ్మెల్సీ భూమిరెడ్డి
డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (Bhumireddy Ramgopal Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 11 డీఎస్సీలు ప్రకటించిన చరిత్ర చంద్రబాబు (Chandrababu)ది అయితే, డీఎస్సీ అంటూ మోసపు ప్రకటనలు చేసిన చరిత్ర జగన్ (Jagan) దని దుయ్యuట్టారు. ఉద్యోగాలు అమ్ముకోవడం జగన్ నైజమని ఆక్షేపించారు. నారా లోకేశ్ (Nara Lokesh) విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు. డీఎస్సీ (DSC)లో ఉద్యోగాలు పొందిన ఏడాది తర్వాత వైసీపీ కావాలని రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, యువత జీవితాలతో జగన్ కుటుంబం ఆడుకుంటోందని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల విషయంలో వైసీపీ కుట్రలు చేస్తోందని అన్నారు. గత ఐదేళ్లలో ఆ పార్టీ హయాంలో విద్యావ్యవస్థను నాశనం చేశారన్నారు.
ఇవి కూడా చదవండి







