ఆయన ఎంత ముందుకు వెళ్లినా.. ఆయన వెనుక నడవడానికి తాము సిద్ధం :నర్సిరెడ్డి
చంద్రబాబు (Chandrababu) సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి (Nannuri Narsireddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి కీర్తి కోసం ఆయన ఎంత ముందుకు వెళ్లినా ఆయన వెనుక నడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎంత ఎక్కువ గాలి వస్తే, గాలిపటం అంత పైకి ఎగురుతుంది. అలాగే ఎన్నో ఇబ్బందులు, అవరోధాలు ఎదుర్కొని ఎదిగిన నారా లోకేశ్ (Nara Lokesh) నాయకత్వంలో భవిష్యత్తుల్లో పార్టీ మరింత రాటుదేలుతుందన్నారు. రాజకీయాల్లో పాత కాలపు క్షమించే ధోరణులు ఇప్పుడు ఉండవని, యువ నాయకత్వంలో వ్యూహాలు చాలా పక్కాగా ఉంటాయని తెలిపారు. నర్సిరెడ్డి చెప్పిన ఇద్దరు రాజుల పిట్టకథ అందరినీ ఆకట్టుకుంది.
ఇవి కూడా చదవండి







