బక్కిన నర్సింహులు సంచలన వ్యాఖ్యలు.. “టీడీపీ పుట్టిందే ఆ కారణం కోసం!”
మహానాడుకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని కొన్ని దుష్ట శక్తులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు (Bakkani Narsimhulu) ఆరోపించారు. తెలంగాణ (Telangana)లో తెలుగుదేశం బలోపేతం అయితే తమకు రాజకీయంగా నష్టమని కొందరు ఆందోళన చెందుతున్నారన్నారు. బక్కిన నర్సింహులు కొందరి స్వార్థ రాజకీయాలకు తెలంగాణ బలికాకూడదనేది తన ఉద్దేశమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగువారి కోసం పుట్టిన పార్టీ అన్నారు. పార్టీ పుట్టిందే తెలంగాణలో అని, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ (NTR) నల్గొండ (Nalgonda)లో పోటీ చేశారని అన్నారు.
ఇవి కూడా చదవండి







