28th May 2026

__________

- Saidulu

ప్లాస్టిక్, స్టీల్, కాపర్.. ఆరోగ్యానికి ఏ వాటర్ బాటిల్ బెస్ట్..

రోజూ నీళ్లు తాగడానికి వాడే వాటర్ బాటిల్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఏ మెటీరియల్ బాటిల్ మంచిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ప్లాస్టిక్ బాటిళ్లు తేలికగా ఉంటాయి కాబట్టి చాలామంది వాడుతారు. కానీ ఎక్కువ వేడి పడితే హానికర రసాయనాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

స్టీల్ బాటిళ్లు బలంగా, ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. నీటి రుచి కూడా ఎక్కువగా మారదు.

కాపర్ బాటిళ్లలో నీళ్లు నిల్వ చేస్తే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. అయితే ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు.

గ్లాస్ బాటిళ్లు నీటి స్వచ్ఛతను అలాగే ఉంచుతాయి. కానీ అవి త్వరగా పగిలే ప్రమాదం ఉంటుంది.

మట్టి బాటిళ్లలో నీళ్లు సహజంగా చల్లగా ఉంటాయి. వేసవిలో ఇవి మంచి ఎంపికగా భావిస్తారు.

ప్లాస్టిక్ బాటిళ్లను ఎక్కువకాలం వాడటం కంటే తరచుగా మార్చడం మంచిది. పాడైన బాటిళ్లు ఆరోగ్యానికి హానికరం కావచ్చు.

ప్రతి బాటిల్‌ను రోజూ శుభ్రం చేయడం చాలా అవసరం. శుభ్రత లేకపోతే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది.

మన అవసరం, వాడకం ఆధారంగా సరైన వాటర్ బాటిల్ ఎంచుకోవాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి నాణ్యత ఉన్న బాటిల్ వాడటం మంచిది.